కిచ్చా సుదీప టైటిల్ ‘దేవరాయ’- శ్రీకృష్ణదేవరాయగా మజెస్టిక్ అవతార్‌లో అదరగొట్టిన కిచ్చా సుదీప
అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ స్పెక్టాకిల్ ‘దేవరాయ’ టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. విజయనగర సామ్రాజ్యంలోని దిగ్గజ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్‌ను మేకర్స్ మజెస్టిక్ అవతార్‌లో పరిచయం చేశారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోపై ప్రియ సుదీప్ సమర్పిస్తున్నారు.
‘దేవరాయ’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో సినిమా ప్రపంచాన్ని అద్భుతంగా పరిచయం చేస్తోంది. భారీ స్థాయిలో, చారిత్రక వైభవంతో తెరకెక్కుతున్న సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. విజువల్స్‌తో పాటు గౌర హరి అందించిన పవర్ఫుల్, మజెస్టిక్ స్కోర్ అనుభూతిని మరింత ఎలివేట్ చేసింది.
రాజసంతో కూడిన అవతార్‌లో సుదీప్ అద్భుతమైన ఇంపాక్ట్ చూపించారు. అద్భుతమైన సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆయన.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన కిరీటం, ముత్యాల ఆభరణాలు, రాజసం ఉట్టిపడే అలంకరణలతో ఆకట్టుకున్నారు. ఆయన పదునైన చూపు, ప్రశాంతమైన హావభావాలు ఒక్క క్షణంలోనే అందరి దృష్టిని ఆకర్షించే రాజు ప్రతిరూపాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో, పోస్టర్‌లోని విజువల్ డీటెయిలింగ్ ఆకట్టుకుంటోంది. ఆ కాలం నాటి వైభవాన్ని, కథ మధ్యలో నిలిచే చక్రవర్తిని ప్రజెంట్ చేసే ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేశారు.
“చరిత్రను మలిచిన సామ్రాజ్యం. ఒక యుగాన్ని నిర్వచించిన రాజు. కాలాన్ని దాటి జీవించే ఒక లెజెండ్.” అనే మూడు శక్తివంతమైన ఆలోచనలతో మేకర్స్ ‘దేవరాయ’ ను పరిచయం చేశారు. విజయనగర సామ్రాజ్యంలోని అత్యంత గొప్ప పాలకుల్లో ఒకరైన శ్రీకృష్ణదేవరాయ ప్రాధాన్యతను ఈ మాటలు చక్కగా ప్రతిబింబిస్తున్నాయి.
తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రల్లో ఇంటెన్సిటీని చూపించే నటుడిగా గుర్తింపు పొందిన సుదీప్.. ఈ పాత్ర కోసం మజెస్టిక్గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఆయన ఫస్ట్ లుక్‌లో రాజసం, పవర్, గౌరవం అద్భుతంగా కనిపిస్తున్నాయి. గ్రాండ్ విజువల్ ట్రీట్మెంట్ మరింత వైభవంగా ఉంది.
2027 డిసెంబర్లో ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది, మేకర్స్ ప్రమోషనల్ జర్నీని గ్రాండ్‌గా ప్రారంభించారు.
దర్శకుడు, ఇతర నటీనటులు, టెక్నికల్ క్రూ వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. ఈ ఫస్ట్ గ్లింప్స్‌తోనే ‘దేవరాయ’ ఒక ప్రతిష్టాత్మక పీరియడ్ స్పెక్టాకిల్‌గా అంచనాలను పెంచింది. అలాగే శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్ పవర్ఫుల్ ఫస్ట్ ఇంప్రెషన్ అందరినీ ఆకట్టుకుంది.








