పుష్కరాల నాటికి ..బాసర నుంచి భద్రాచలం వరకు : మంత్రి పొంగులేటి
భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) దర్శించుకున్నారు. ప్రధాన ఆలయలోని స్వామి వారి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.351 కోట్లతో చేపడుతున్న ఆలయ పున నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. భద్రాద్రి ఆలయాన్ని భక్తులు మెచ్చేలా విశాలంగా, అత్యంత సుందరంగా పునర్నిర్మిస్తామని తెలిపారు. బాసర (Basara) నుంచి భద్రాచలం (Bhadrachalam) వరకు గోదావరి (Godavari) తీరంలో ఉన్న అన్ని ఆలయాలను పుష్కరాల నాటికి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అందులో భాగంగానే రాములోరి ఆలయాన్ని, భద్రాచలం పట్టణాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.








