ఆక్వా రంగం పై అమెరికా మరో పిడుగు
ఆక్వా రంగంపై అమెరికా (America) మరో పిడుగు వేసింది. 2024-25 సంవత్సరానికి 5.53 శాతం చొప్పున యాంటీ డంపింగ్ డ్యూటీ (ఏడీడీ) విధించింది. దీంతో ఎగుమతిదారులపై రూ.1,000 కోట్ల మేర భారం పడనుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) అధికారంలోకి రాగానే సుంకాల మోత ప్రారంభించారు. ప్రతీకార సుంకాల పేరుతో రొయ్యల (Shrimp) ఎగుమతి వ్యాపారుల్ని బెంబేలెత్తించారు. తర్వాత దాని నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినా, ఇతర సుంకాలతో బాదేస్తున్నారు. 10 శాతం టారిఫ్, 5.77 శాతం కౌంటర్వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ) రూపంలో చెల్లించాలి. వీటికి అనదంగా ఏడీడీ (ADD) కింద 5.53 శాతం (2024-25 ఏడాదికి) నిర్ణయించారు. అంటే మొత్తంగా 21.30 శాతం పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. విదేశీ వస్తువుల దిగుమతులపై అమెరికా విధించే అదనపు పన్నే ఏడీడీ. స్వదేశీ (అమెరికా) మార్కెట్ విలువతో పోలిస్తే తక్కువధరకు అమ్ముతున్నారని భావించినప్పుడు దీన్ని విధిస్తారు.








