కార్తీకి అంత ఈజీ కాదు.. సర్దార్2 కోసం ఎంత కష్టపడ్డాడంటే!
కార్తీ(karthi) హీరోగా పీఎస్ మిత్రన్(PS Mitran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సర్దార్2(sardar2)పై అంచనాలు పెరుగుతున్నాయి. తొలి భాగంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్పై వరల్డ్ ను ఈసారి మరింత విస్తృత స్థాయిలో చూపించబోతున్నారు. తండ్రి, కొడుకు పాత్రలను ఒకేసారి పోషించడం కార్తీకి పెద్ద సవాలుగా మారిందని తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధ స్పై పాత్ర కోసం భారీ ప్రోస్తెటిక్ మేకప్‌తో పాటు స్పెషల్ బాడీ లాంగ్వేజ్‌ను మెయింటైన్ చేయాల్సి రావడం షూటింగ్లో ఎంతో ఓపికను కోరిందట.
యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో కూడా ఈసారి కొత్త విధానం కనిపించనుంది. సాధారణంగా యంగ్ హీరో చేసే పవర్ఫుల్ ఫైట్స్‌కు భిన్నంగా, ఎక్స్పీరియెన్డ్స్ వృద్ధ ఆపరేటివ్ తన తెలివి, టెక్నిక్‌తో ప్రత్యర్థులను ఎదుర్కొనేలా సన్నివేశాలను రూపొందించారు. మరోవైపు ఎస్జే సూర్య(SJ Surya) పోషిస్తున్న విలన్ క్యారెక్టర్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని సమాచారం. ఆషిక రంగనాథ్(Ashika Ranganath), మాళవిక మోహనన్(Malavika Mohanan) పాత్రలు కూడా దేశం కోసం పోరాడే బలమైన క్యారెక్టర్లుగా ఉండనున్నాయి.
మొదటి భాగం పిల్లల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు విస్తృతంగా చేరుకోవడంతో, సీక్వెల్‌పై డైరెక్టర్ పీఎస్ మిత్రన్ మరింత భారీ స్కేల్లో పనిచేశారు. స్పై క్యారెక్టర్ లో ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయని కార్తీ చెబుతుండటంతో కథపై ఆసక్తి పెరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్, ఉత్కంఠభరితమైన డ్రామాతో రూపొందుతున్న సర్దార్2 సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రిన్స్ పిక్చర్స్(Prince Pictures) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో ప్రతిష్ఠాత్మక అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) రిలీజ్ చేయనుంది.








