జైలర్2 తెలుగు రైట్స్ నాగవంశీకేనా? ఫైనల్ డీల్‌పై ఉత్కంఠ!
సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్2(Jailer2) తెలుగు థియేట్రికల్ రైట్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ రైట్స్ ను దక్కించుకునే రేసులో యంగ్ ప్రొడ్యూసర్ ఎస్. నాగవంశీ(S. Naga vamsi) ముందంజలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫైనల్ డిస్కషన్స్ కొనసాగుతుండగా, అమెరికా వెళ్లే ముందు నాగవంశీ తన ప్రతిపాదనను చిత్ర నిర్మాణ సంస్థ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లో ఈ డీల్‌పై ఫైనల్ డెసిషన్ వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ ప్రాతిపదికన సినిమాను రిలీజ్ చేసేందుకు ఏషియన్ సునీల్(Asian Suneel) కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(Suresh babu) సహకారం కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే నాగవంశీ తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుంటే, స్వయంగా ఆయనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసే అవకాశముంది. డైరెక్టర్ నెల్సన్(Nelson)తో నాగవంశీకి ఉన్న సన్నిహిత అనుబంధం కూడా ఈ డీల్‌లో కీలకంగా మారవచ్చని టాక్ వినిపిస్తోంది.
ఇక జైలర్2 విడుదల వాయిదా పడుతుందంటూ వస్తున్న ఊహాగానాలకు చిత్ర బృందం కూడా చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారమే అక్టోబర్ 15న దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మిస్తోంది. అనిరుధ్(Anirudh) మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, జైలర్ సక్సెస్ తో ఏర్పడిన భారీ అంచనాల మధ్య సీక్వెల్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.








