Twitterనే కబ్జా చేద్దామనుకున్నారు.. మస్క్ ఊరుకుంటాడా మరి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
జనాలు కేవలం ఖాళీ స్థలాలు మాత్రమే కబ్జా చేస్తారనుకుంటే మీ భ్రమ! వేరే వాళ్ల ఆలోచనలే మావి అని చెప్పుకుని వాటిని కబ్జా చేసే రోజులు ఇవి. అందుకే చాలా మందికి ఏది ఖాళీగా కనిపించినా, దాని ఓనర్‌కు దానిపై ఇక దృష్టి లేదని అనిపించినా చాలు… వెంటనే మనసులో ఓ ఆలోచన మెరుస్తుంది. “ మనం సొంతం చేసుకుంటే పోలా!”అదిరిపోలా అని తమ భుజాలు తామే మెచ్చేసుకుని రంగంలోకి దిగిపోతారు. అలాగే ఇప్పుడు ఒకరు ఏకంగా Twitter పేరు వాడటం లేదు కదా ఖాళీగా ఉందని కబ్జా చేద్దామని రంగంలోకి దూకారు.మరి ఈ విషయం తెలిసిన మస్క్ ఊరుకుంటాడా.ఏం చేసాడు..అశలు Twitter ని కబ్జా చేయటం ఏమిటి..అసలు ఎవరా హెవీ టాలెంటెడ్ పర్సన్స్. చివరకు ఏమైందో టెక్నో కలర్ లో చూద్దాం.
Twitter అప్పట్లో పెద్ద తోపు!
ఇప్పుడు సోషల్ మీడియా అంటే Instagram, YouTube, Facebook అంటూ ఒక్కో యాప్‌లో తలదూర్చుకుని రోజంతా గడిపేస్తున్నాం కానీ…ఒకటైమ్ లో ట్విట్టర్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. X అని ఇప్పుడు గొప్పగా కనిపిస్తున్న ఈ యాప్‌కు ఒకప్పుడు Twitter అనే పేరు ఉండేది! అది మాకు తెలుసు అంటారా..గుర్తు చేస్తున్నాం అంతే. ఇప్పటికీ ఆ యాప్ స్పెషాలిటీ ఏమిటంటే ప్రపంచంలో ఏం జరిగినా ముందు అక్కడే హడావుడి,రచ్చ మొదలు అవుతుంది.
పొలిటీషన్స్ ఏమి చెప్పారు. ప్రేమికులు ఏమి మాట్లాడుకున్నారు. స్టార్ హీరో ఏం ట్వీట్ చేసాడు. క్రికెట్ మ్యాచ్ కబుర్లు ఏంటి? ఇదిగో ఇలాంటివన్నీ అక్కడ హాట్ టాపిక్సే. పెద్ద రచ్చ బండ లాంటిది. అక్కడ జనం కొట్టేసుకుంటారు. కోట్స్ షేర్ చేసుకుంటారు. ఏం కొనాలో మాట్లాడుకుంటారు..కొన్న వస్తువులు బాగోలేకపోతే అక్కడ చాకిరేవు పోగ్రాం పెడతారు. ఇరవై నాలుగు గంటలూ Twitterలో హడావుడి అలా ఉండేది.
ఆ చిన్న నీలిరంగు పక్షి లోగోకు అప్పట్లో ఉన్న క్రేజ్ అలాంటిది!
అది ఎంతపాపులర్ అయ్యిందంటే…”ట్వీట్ చేశావా?” అనేది మామూలు మాటగా మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్స్ తోటే అక్కడ ఓ పెద్ద ప్రపంచం క్రియేట్ చేసారు. ఇలా ప్రపంచ నాయకుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఒకే వేదికపై తమ అభిప్రాయాలు చెప్పుకునే స్థాయికి Twitter ఎదిగింది.
అంటే, Twitter కేవలం ఒక సోషల్ మీడియా యాప్ కాదు… ప్రపంచం మాట్లాడుకునే అడ్డాగా మారిపోయింది. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు ఎలాన్ మస్క్ మామ! ఇంత ఊపు మీదున్న Twitterను 2022లో ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాడు. అప్పటినుంచి అసలు ట్విట్టర్ కథే మారిపోయింది.
మస్క్ వచ్చిన తర్వాత ఉద్యోగుల తొలగింపులు, కొత్త నిబంధనలు, బ్లూ టిక్ వ్యవహారం… ఇలా ఒకదాని తర్వాత ఒకటి సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే అందరినీ నిజంగా షాక్‌కు గురిచేసిన నిర్ణయం మాత్రం ఇంకొకటి. అదే ఏళ్ల తరబడి ప్రపంచం గుర్తుపట్టిన Twitter పేరునే తీసేయడం!
Twitterను Xగా ఎందుకు మార్చాడు?
ఇది మస్క్‌కు ఒక్కరోజులో వచ్చిన ఆలోచన కాదు. నిజానికి X అనే అక్షరంపై మస్క్‌కు చాలా కాలంగా ప్రత్యేకమైన మోజు ఉంది. ఆయన మొదట ప్రారంభించిన ఆన్లైన్ బ్యాంకింగ్ సంస్థ పేరు X.com. తర్వాత ఆయనకు చెందిన అనేక కంపెనీలు, ప్రాజెక్టుల్లో కూడా X అక్షరం కనిపిస్తుంది. అందుకే Twitterను కేవలం ట్వీట్లు చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉంచకుండా, మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మస్క్ భావించాడు.
ఆయన కల ఏమిటంటే…
చైనాలోని WeChat తరహాలో ఒకే యాప్‌లో అన్నీ! మెసేజ్‌లు పంపుకోవడం… వీడియోలు చూడటం… డబ్బులు పంపడం… బిజినెస్ చేయడం… ఇలా అన్నింటికీ ఒకే ప్లాట్‌ఫామ్‌గా మార్చాలనేది మస్క్ ఆలోచన. అందుకే Twitter అనే పేరు తన పెద్ద ప్లాన్‌కు సరిపోదని భావించి, దాన్ని Xగా మార్చాడు.
ఇక్కడే మన హీరోలకు కొత్త ఐడియా వచ్చింది
మస్క్ Twitter పేరును తీసేసి Xగా మార్చడంతో, కొందరికి ఒక వింత ఆలోచన వచ్చింది. “అరే… మస్క్ Twitter పేరు వాడటం మానేశాడు కదా!పాపం బిడ్డ అనాథ అయ్యిపోయింది దానికి మనం మళ్లీ లైఫ్ ఇద్దాం అని రంగంలోది దూకేసారు. Twitter పేరునే కబ్జా చేసి, అదే పేరుతో కొత్త సోషల్ మీడియా యాప్ పెట్టేద్దామంటూ పెద్ద స్కెచ్చే వేశారు!ఆ స్కెచ్ వేసింది Operation Bluebird అనే స్టార్టప్.
అనుకున్నదే తడువుగా Twitter.now పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. మొదట వారి స్కెచ్ దాదాపు సక్సెస్ అయినట్టే కనిపించింది. కానీ… ఇక్కడే మస్క్ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది! Twitter పేరు తమదేనని X Corp. కోర్టును ఆశ్రయించింది. “మేం పేరును మార్చుకున్నాం కాబట్టి Twitterపై హక్కులను వదిలేసినట్టు కాదు” అన్నది వారి వాదన.సెప్టెంబర్ 3న కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. Twitter అనే పేరుపై ట్రేడ్‌మార్క్ హక్కులు ఇప్పటికీ X Corp.కే ఉన్నాయని స్పష్టం చేసింది.
అసలు ఈ ట్విట్టర్ పేరులో ఏముంది..ఏం కలిసివస్తుంది?
ఎవరైనా కొత్తగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తే ఎవరికి తెలుస్తుంది. అసలు అది పాపులర్ అవ్వటానికి ఎంత టైమ్ పడుతుంది. భారీగా మార్కెటింగ్ చేయాలి. ప్రకటనలు ఇవ్వాలి. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. సెలబ్రిటీలను తీసుకురావాలి.
కానీ అదే పేరు Twitter అయితే? అంతా ఈజీ! ఆ పేరు చూడగానే కోట్లాది మందికి వెంటనే గుర్తొస్తుంది. “అరే… Twitter మళ్లీ వచ్చేసిందా?” అనే ఆసక్తి కలుగుతుంది.
Twitter పేరు ఉంటే జనాలు వస్తారు… జనాలు వస్తే యాప్ పెరుగుతుంది… యాప్ పెరిగితే బిజినెస్ పెరుగుతుంది! Operation Bluebird అసలు లెక్క ఇదే.
అంటే వాళ్లు పాత Twitterను యథాతథంగా తిరిగి తీసుకురావాలని అనుకోలేదు. కొత్త తరహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తయారు చేయాలనుకున్నారు. కానీ దానికి ప్రపంచానికి ముందే తెలిసిన Twitter అనే పేరు పెట్టాలని ప్లాన్ చేశారు.
Operation Bluebird ఏమంటారంటే… ఎలాన్ మస్క్ Twitter పేరును పూర్తిగా పక్కన పెట్టేశారు. కంపెనీని Xగా మార్చేశారు. నీలి పక్షి లోగోను తొలగించారు కదా . అందుకే మేము ముందుకు అడుగువేసాం అని.
ఖాళీగా కనిపించిందని ప్రతిదీ మనదైపోదు కదా!
ఏదైతేనేం పెద్ద స్కెచ్ వేసిన Operation Bluebird వెంటనే దానికి బ్రేక్ వేయాల్సి వచ్చింది. “Twitterను తిరిగి తీసుకొచ్చాం” అని చెప్పిన కంపెనీకి కొన్ని రోజులకే Twitter పేరును తీసేయాల్సి వచ్చింది!
ఫైనల్ గా..
ఏదైమైనా వాళ్లు Twitterను వెనక్కి తిరిగి తీసుకువద్దామనే గొప్ప ఆలోచన ఘోరంగా విఫలం కావచ్చు . కానీ ఒక గొప్ప విషయాన్ని మాత్రం నిరూపించారు—కొన్ని వ్యాపార ఆలోచనలు అద్భుతం.అయితే అవి కోర్టు తీర్పు వచ్చే వరకు మాత్రమే.
ని తర్వాత ఒకటి సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే అందరినీ నిజంగా షాక్‌కు గురిచేసిన నిర్ణయం మాత్రం ఇంకొకటి. అదే ఏళ్ల తరబడి ప్రపంచం గుర్తుపట్టిన Twitter పేరునే తీసేయడం!
Twitterను Xగా ఎందుకు మార్చాడు?
ఇది మస్క్‌కు ఒక్కరోజులో వచ్చిన ఆలోచన కాదు. నిజానికి X అనే అక్షరంపై మస్క్‌కు చాలా కాలంగా ప్రత్యేకమైన మోజు ఉంది. ఆయన మొదట ప్రారంభించిన ఆన్లైన్ బ్యాంకింగ్ సంస్థ పేరు X.com. తర్వాత ఆయనకు చెందిన అనేక కంపెనీలు, ప్రాజెక్టుల్లో కూడా X అక్షరం కనిపిస్తుంది. అందుకే Twitterను కేవలం ట్వీట్లు చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉంచకుండా, మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మస్క్ భావించాడు.
ఆయన కల ఏమిటంటే…
చైనాలోని WeChat తరహాలో ఒకే యాప్‌లో అన్నీ! మెసేజ్‌లు పంపుకోవడం… వీడియోలు చూడటం… డబ్బులు పంపడం… బిజినెస్ చేయడం… ఇలా అన్నింటికీ ఒకే ప్లాట్‌ఫామ్‌గా మార్చాలనేది మస్క్ ఆలోచన. అందుకే Twitter అనే పేరు తన పెద్ద ప్లాన్‌కు సరిపోదని భావించి, దాన్ని Xగా మార్చాడు.
ఇక్కడే మన హీరోలకు కొత్త ఐడియా వచ్చింది
మస్క్ Twitter పేరును తీసేసి Xగా మార్చడంతో, కొందరికి ఒక వింత ఆలోచన వచ్చింది. “అరే… మస్క్ Twitter పేరు వాడటం మానేశాడు కదా!పాపం బిడ్డ అనాథ అయ్యిపోయింది దానికి మనం మళ్లీ లైఫ్ ఇద్దాం అని రంగంలోది దూకేసారు. Twitter పేరునే కబ్జా చేసి, అదే పేరుతో కొత్త సోషల్ మీడియా యాప్ పెట్టేద్దామంటూ పెద్ద స్కెచ్చే వేశారు!ఆ స్కెచ్ వేసింది Operation Bluebird అనే స్టార్టప్.
అనుకున్నదే తడువుగా Twitter.now పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. మొదట వారి స్కెచ్ దాదాపు సక్సెస్ అయినట్టే కనిపించింది. కానీ… ఇక్కడే మస్క్ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది! Twitter పేరు తమదేనని X Corp. కోర్టును ఆశ్రయించింది. “మేం పేరును మార్చుకున్నాం కాబట్టి Twitterపై హక్కులను వదిలేసినట్టు కాదు” అన్నది వారి వాదన.సెప్టెంబర్ 3న కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. Twitter అనే పేరుపై ట్రేడ్‌మార్క్ హక్కులు ఇప్పటికీ X Corp.కే ఉన్నాయని స్పష్టం చేసింది.
అసలు ఈ ట్విట్టర్ పేరులో ఏముంది..ఏం కలిసివస్తుంది?
ఎవరైనా కొత్తగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తే ఎవరికి తెలుస్తుంది. అసలు అది పాపులర్ అవ్వటానికి ఎంత టైమ్ పడుతుంది. భారీగా మార్కెటింగ్ చేయాలి. ప్రకటనలు ఇవ్వాలి. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. సెలబ్రిటీలను తీసుకురావాలి.
కానీ అదే పేరు Twitter అయితే? అంతా ఈజీ! ఆ పేరు చూడగానే కోట్లాది మందికి వెంటనే గుర్తొస్తుంది. “అరే… Twitter మళ్లీ వచ్చేసిందా?” అనే ఆసక్తి కలుగుతుంది.
Twitter పేరు ఉంటే జనాలు వస్తారు… జనాలు వస్తే యాప్ పెరుగుతుంది… యాప్ పెరిగితే బిజినెస్ పెరుగుతుంది! Operation Bluebird అసలు లెక్క ఇదే.
అంటే వాళ్లు పాత Twitterను యథాతథంగా తిరిగి తీసుకురావాలని అనుకోలేదు. కొత్త తరహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తయారు చేయాలనుకున్నారు. కానీ దానికి ప్రపంచానికి ముందే తెలిసిన Twitter అనే పేరు పెట్టాలని ప్లాన్ చేశారు.
Operation Bluebird ఏమంటారంటే… ఎలాన్ మస్క్ Twitter పేరును పూర్తిగా పక్కన పెట్టేశారు. కంపెనీని Xగా మార్చేశారు. నీలి పక్షి లోగోను తొలగించారు కదా . అందుకే మేము ముందుకు అడుగువేసాం అని.
ఖాళీగా కనిపించిందని ప్రతిదీ మనదైపోదు కదా!
ఏదైతేనేం పెద్ద స్కెచ్ వేసిన Operation Bluebird వెంటనే దానికి బ్రేక్ వేయాల్సి వచ్చింది. “Twitterను తిరిగి తీసుకొచ్చాం” అని చెప్పిన కంపెనీ కొన్ని రోజులకే Twitter పేరును తీసేయాల్సి వచ్చింది!