‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కించిన చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషించగా. వర్షిక పాశం హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ అందరినీ మెప్పించింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అనే పాటను రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఎస్. సుహాస్ బాణీ, జగదీష్ సాహిత్యంతో పాటుగా చైతన్య, లాస్య గాత్రం ఈ పాటను వినసొంపుగా మార్చాయి. ఇక ఈ లిరికల్ వీడియోని గమనిస్తే హీరో, హీరోయిన్.. లవ్ ట్రాక్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేట్టు కనిపిస్తోంది. విజువల్స్ ఎంతో ప్లెజెంట్‌గా అనిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్లతో ఆడియెన్స్‌ని అలరిచేందుకు టీం రెడీగా ఉంది.








