ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి(Amaravati)లో జరిగిన కలెక్టర్ల సదస్సు( Collectors Conference)లో రెవెన్యూ సంస్కరణలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) కీలక ప్రకటనలు చేశారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల (Freehold lands) రిజిస్ట్రేషన్లకు ఇవాళ్టి నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలు చోటుచేసుకున్న 4 లక్షల ఎకరాలపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, గత ప్రభుత్వం 22-ఏలో చేర్చిన 28 లక్షల ఎకరాలను ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పారు. 22-ఏ నుంచి భూములు తొలగింపును సులభతరం చేసేందుకు జీవో 444, కొత్తగా భూములను 22-ఏలో చేర్చే విధానాన్ని స్పష్టం చేస్తూ జీవో 445 జారీ చేశామని వివరించారు. భూమి హక్కులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బీ భూమి- బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని తెలిపారు.








