రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఎన్నారైలందరూ కృషి చేయాలి : డా. గురు రాజా, ప్రెసిడెంట్, గ్లోబల్ ఎన్నారై టీడిపి
గ్లోబల్ ఎన్నారై టీడిపి కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరియు పార్టీ మనుగడ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు చేసిన పోరాటం అమోఘం. కేవలం నిరసనకే పరిమితం కాకుండా, పార్టీ శ్రేణులకు అండగా నిలవడంలోనూ, సోషల్ మీడియా వేదికగా నిజాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ ఎన్నారైలు కీలక పాత్ర వహించారు. ప్రజారంగ ప్రభుత్వం ఏర్పడటం మనందరికీ గర్వకారణమని గ్లోబల్ ఎన్నారై కమిటీ ప్రమాణ స్వీకార మీVAత్సవంలో ప్రెసిడెంట్ డా. గురురాజా అన్నారు.
తెలుగుదేశం పార్టీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల మద్దతును మరింత బలోపేతం చేయడమే నూతన కార్యవర్గం లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నారా లోకేష్ విజన్‌కు అనుగుణంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఎనఆరఐ టీడీపీ శ్రేణులను ఒకే యూనిట్‌గా తీర్చిదిద్దే దిశగా కొత్త కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సేవా అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్టీ మనుగడ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై లు చేసిన కృషిని గుర్తుచేశారు. ఎన్నారై టీడీపీ కేవలం రాజకీయ విభాగం కాదని, ప్రవాసాంధ్రులకు–ఆంధ్రప్రదేశ్‌కు మధ్య వారధిగా పనిచేస్తుందని విదేశాల్లో ఉన్నప్పటికీ తమ మూలాలను మరవకుండా సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి ఎనఆరఐపై ఉందన్నారు. వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లినా పార్టీపై, సిద్ధాంతంపై తన అభిమానం మారలేదని చెప్పారు. “దేశం మారింది కానీ నా పార్టీ మారలేదు.. స్థలం మారింది కానీ నా సిద్ధాంతం మారలేదు. జీవితం అమెరికాలో ఉన్నా.. నా మనసు మాత్రం తెలుగుదేశంతోనే ఉంది” అని గురురాజా పేర్కొన్నారు.
ఇప్పుడు మన ముందు మరో పెద్ద లక్ష్యం ఉంది. అది మన నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం. దీనికోసం ఈ గ్లోబల్ ఎన్నారై కమిటీ మరింత క్రియాశీలంగా పని చేయాల్సిన అవసరం ఉంది. శ్రీ నందమూరి తారక రామారావు గారు చేపట్టిన చైతన్య రథయాత్ర స్ఫూర్తితో ఒక యువకుడిగా తెలుగుదేశం పార్టీతో నా అనుబంధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడివిడిగా ఉన్న తెలుగుదేశం అభిమానులను, కార్యకర్తలను ఒకే వేదికపైకి తెచ్చిన ఎన్నారై టీడిపికి అధ్యక్షుడిని అవడం చాలా అదృష్టం. ప్రపంచవ్యాప్త శ్రేణులను ఒకే కాడిపైకి తెచ్చేందుకూ, నారా లోకేష్ గారు చేసిన ఆ బృహత్తర ప్రయత్నంలో నా వంతు పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి, మంత్రి నారా లోకేష్గారికి నా ధన్యవాదాలు.
ప్రపంచ అవకాశాలు తలుపులు తెరిచి, భవిష్యత్తు ఐటీ తరాలకు మార్గదర్శిగా నిలిచిన మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు ఊరికి ఒక్కరు విదేశాలకు వెళితే గొప్ప. చంద్రబాబుగారు కల్పించిన సదుపాయాల వల్ల నేడు ఊళ్లకు ఊళ్లే ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి పునాదిగా నిలిచింది. మన నారా లోకేష్ గారు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత స్ఫూర్తినిస్తున్నారు. పార్టీయే దేవాలయం, కార్యకర్తలే దేవుళ్ళు అని నమ్మి కష్టపడే వ్యక్తి ఒక్కరికి తగిన గుర్తింపు పరువునిస్తున్న యువనేత నారా లోకేష్. లేదు, కాదు. దేశానికి నేనేమి ఇచ్చాననేది ముఖ్యం అనేవారు. మరి ఇప్పుడు పార్టీకి కార్యకర్తలు ప్రాణపరంగా పెట్టి పనిచేస్తున్నారు.


లోకేష్ గారు ఆరోజు మీరు మొదలు పెట్టింది పాదయాత్ర కాదు, రణయాత్ర. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మొదలైతే పాదయాత్ర, కానీ ఆరోజు అప్రజాస్వామ్య ప్రభుత్వంలో మొదలైంది కాబట్టి అది రణయాత్ర. లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, స్వర్ణాంధ్రప్రదేశ్ లో మనమంతా భాగస్వాములమవుదాం. జన్మభూమి రుణం తీర్చుకుందాం. మనం ఆర్థికంగా ఎదిగితే సరిపోదు; మనతో పాటు మన సమాజం కూడా ఎదగాలని ఆలోచించే మన నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఎన్నారై టీడిపి కేవలం రాజకీయ విభాగం కాదు; ప్రపంచ వ్యాప్త ప్రవాసాంధ్రులను రాష్ట్రాన్ని కలిపే వారధి. నూటా అరవై ఐదు దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. అందులో సుమారు నలభై నుంచి అరవై లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. వారిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నవారి సంఖ్య సుమారు యాభై వేలు. ఎన్నారైలకు మద్దతు వారికి కావాలి. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ మా సేవలు చేరవేయాలన్నదే మా ముందున్న లక్ష్యం. క్రియాశీల సభ్యత్వాలు పెంచే దిశగా మా ప్రణాళికలు ఉండబోతున్నాయి.
సోషల్ మీడియా అనే శక్తివంతమైన వేదిక ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, టీడీపీ విధానాలు, చంద్రబాబు గారి విజన్, లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రపంచ వ్యాప్తముగా చేరవేయాలి. దీని ద్వారా మన గ్లోబల్ ఎన్నారై కుటుంబం రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది మోడర్న్ అగ్రికల్చర్ చేయవచ్చు. అంటే, అల్మోస్ట్ టెన్ టు థర్టీన్ పర్సెంట్. ఒకటే లక్ష్యం, మనం చేయాల్సిందంతా ఒకటే. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూనే ఉండాలి. శ్రీరామ రక్ష, ఈరోజు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తున్న కమిటీ సభ్యులంతా ప్రతి దేశంలోని తెలుగు కుటుంబాలకు చేరువు కావాలి. యువత, మహిళలు, ఐటీ ప్రొఫెషనల్స్, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులను ఒకే తాటిపైకి తెచ్చి పార్టీని బలోపేతం చేయడమే మన లక్ష్యం. వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ మరియు స్వగ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తాను. ముఖ్యంగా, నాపై నమ్మకంతో బాధ్యతలు ఉంచిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా ప్రధాన కర్తవ్యం. నిర్మిస్తున్న యువశక్తితో ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచములోని అత్యుత్తమ రాష్ట్రంగా నిర్మించే ప్రయాణంలో గ్లోuల్ ఎన్నారై టీడిపి కీలకపాత్రపోషిస్తుందని ఆయన చెప్పారు.








