ఫ్యాషన్ సెన్స్ తో మాయ చేస్తున్న శృతి
సినిమాలతో పాటూ తన ఫ్యాషన్ సెన్స్ తో ఆడియన్స్ ను అలరించే హీరోయిన్లలో శృతి హాసన్(Shruthi Haasan) కూడా ఒకరు. లోక నాయకుడు కమల్ హాసన్(kamal Haasan) కూతురిగా భారీ పాపులారిటీ అందుకున్న ఆమె తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేసే శృతి తాజాగా జిప్సీ డ్రెస్ సెట్ ను ధరించింది. ఈ డ్రెస్ శృతి నడుము భాగాన్ని ఎలివేట్ చేయగా, అమ్మడు ఈ జిప్సీ డ్రెస్ లో మరింత అందంగా ఉందని నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.








