ఇవి చెక్ చెయ్యకుండా… Refurbished Phone కొంటె మోసపోయినట్టే!
కొత్త స్మార్ట్‌ఫోన్ (Smartphone) ధరలు ఎక్కువగా ఉండటంతో తక్కువ బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలనుకునేవారు రీఫర్బిష్డ్ ఫోన్ల (Refurbished Phones) వైపు చూస్తున్నారు. సాధారణంగా గతంలో ఉపయోగించిన ఫోన్లను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేసి, మళ్లీ విక్రయించడాన్ని రీఫర్బిష్డ్ ఫోన్ అంటారు. కొత్త ఫోన్‌తో పోలిస్తే తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్లు లభించే అవకాశం ఉన్నప్పటికీ, సరైన తనిఖీలు చేయకుండా కొనుగోలు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఐఎంఈఐ నుంచి బ్యాటరీ వరకు.. ఫోన్ కండిషన్ చెక్ చేయండి

ముందుగా ఫోన్ ఐఎంఈఐ నంబర్ (IMEI Number)ను తప్పనిసరిగా చెక్ చేయాలి. ఫోన్లో కనిపించే నంబర్, బాక్స్‌పై ఉన్న నంబర్, బిల్లో నమోదైన నంబర్ ఒకేలా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఈ వివరాల్లో తేడా కనిపిస్తే ఫోన్ కొనకుండా ఉండటం మంచిది. అలాగే పరికరం దొంగిలించబడినదా, బ్లాక్‌లిస్ట్‌లో ఉందా వంటి అంశాలను కూడా సాధ్యమైనంత వరకు ధృవీకరించాలి.
తర్వాత ఫోన్ బయట భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. స్క్రీన్‌పై గీతలు, బాడీలో పగుళ్లు, కెమెరా చుట్టూ దెబ్బల గుర్తులు, ఛార్జింగ్ పోర్ట్ పరిస్థితి వంటి వాటిని చూడాలి. చిన్న గీతలు సాధారణ వినియోగానికి సంబంధించినవి కావచ్చు. కానీ పరికరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తే దాని గత వినియోగంపై అనుమానం రావచ్చు.
బ్యాటరీ, కెమెరా నుంచి నెట్వర్క్ వరకు.. అన్నీ పరీక్షించండి

బ్యాటరీ (Battery) ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ కోల్పోతుందా, సాధారణ వినియోగంలో ఎక్కువగా వేడెక్కుతుందా, ఛార్జింగ్ సరిగా జరుగుతుందా అనే విషయాలను పరీక్షించాలి. కొన్ని ఫోన్లలో బ్యాటరీ ఆరోగ్య వివరాలను సెట్టింగ్స్‌లోనే చూడవచ్చు. బ్యాటరీ పనితీరు బలహీనంగా ఉంటే భవిష్యత్తులో అదనపు ఖర్చు రావచ్చు.
ఇవి కూడా చదవండి
కెమెరా (Camera), మైక్రోఫోన్ (Microphone), స్పీకర్లు (Speakers), వైబ్రేషన్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (Fingerprint Sensor), ఫేస్ అన్‌లాక్ (Face Unlock), వై-ఫై (Wi-Fi), బ్లూటూత్ (Bluetooth), సిమ్ నెట్వర్క్ వంటి అన్ని ఫీచర్లను కొనుగోలు చేసే ముందు పరీక్షించడం మంచిది. టచ్స్క్రీన్లో ప్రతి భాగం సరిగ్గా స్పందిస్తుందో లేదో కూడా ఒకసారి చెక్ చేయాలి.
సాఫ్ట్వేర్ సపోర్ట్, విక్రేత నమ్మకాన్ని కూడా చూడండి

ఫోన్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ (Operating System) వెర్షన్ ఉందో, దానికి ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్లు (Software Updates) వస్తున్నాయో తెలుసుకోవాలి. చాలా పాత మోడల్ అయితే భవిష్యత్తులో యాప్‌లకు అనుకూలత తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల కేవలం తక్కువ ధరను చూసి నిర్ణయం తీసుకోకుండా ఫోన్ వయసు, మోడల్, సాఫ్ట్వేర్ మద్దతును పరిగణనలోకి తీసుకోవాలి.
చివరగా విక్రేత విశ్వసనీయతను పరిశీలించడం చాలా ముఖ్యం. సరైన బిల్, వారంటీ (Warranty), రిటర్న్ పాలసీ (Return Policy) అందిస్తున్నారా లేదా తెలుసుకోవాలి. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే విక్రేత రేటింగ్‌లు, వినియోగదారుల సమీక్షలు, రీఫర్బిష్ చేసిన పరికరాలపై సంస్థ అందించే హామీలను చదవాలి.ీ ఈ చిన్న చెక్స్ ముందుగానే చేస్తే తక్కువ ధరలో మంచి ఫోన్ కొనడంతో పాటు అనవసరమైన మోసాలు, అదనపు ఖర్చులను కూడా నివారించవచ్చు.








