పాలిటెక్నిక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ : మంత్రి వివేక్
త్వరలోనే పాలిటెక్నిక్ విద్యార్థుల (Polytechnic students)కు గుడ్ న్యూస్ చెబుతామని తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ (Minister Vivek) తెలిపారు. శాసనసభలో విద్యాసంస్కరణలపై జరిగిన చర్చలో వివేక్ మాట్లాడారు. జీవో నంబర్ 97లో మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్య రూ.8వేల కోట్లతో ఆధునికీకరించాలని భావిస్తున్నాం. పాలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ (Privatization) అవుతుందని అపోహలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. ఏఐసీటీఈ సర్టిఫికెట్ కొనసాగుతుందని విద్యార్థులకు చెప్పాం. ఇంజినీరింగ్ (Engineering)లో లేటరల్ ఎంట్రీ ఉంటుందని వివరించాం. కొత్త కోర్సులపై అధ్యాపకులకు శిక్షణ ఇస్తాం అని తెలిపారు.








