తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం .. అనలాగ్ పనీర్ పై
తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్ (Analogue), నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్ (Artificial Paneer) పై నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు టీజీ సేఫ్ (TG-safe) వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పనీర్ పేరుతో తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా విక్రయాలపై టీజీ సేఫ్ నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 10 నుంచి ఈ నిర్ణయం అమల్లో ఉన్నట్లు పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ -2026లోని సెక్షన్ 30(2)ఎ) కింద టీజీ సేఫ్ ఆదేశాలు జారీ చేసింది.








