ఫ్లోరల్ డ్రెస్ లో మెరిసిపోతున్న సీత
సీతారామం(Sitaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఫాలోవర్లతో పంచుకునే మృణాల్ లేటెస్ట్ ఫోటోషూట్ తెగ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలో మృణాల్ లైట్ బ్లూ, ఫ్లోరల్ డిజైన్ తో ఉన్న అవుట్‌ఫిట్ లో చాలా సింపుల్ గా కనిపించింది. అవుట్‌ఫిట్ కు తగ్గట్టు లూజ్ హెయిర్, గోల్డ్ జ్యువెలరీ, నేచురల్ మేకప్ తో కనిపించగా, ఆమె చిరునవ్వు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఎలిగెంట్ లుక్ తో మృణాల్ ఎంతో అందంగా కనిపిస్తుందని నెటిజన్లు ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.








