బీఆర్ఎస్ నేతలు డ్రామాలకు తప్ప దేనికి పనికిరారు… సామ రామ్మోహన్ రెడ్డి సెటైరికల్ పోస్ట్
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు డ్రామాలకు తప్ప దేనికి పనికిరారని కాంగ్రెస్ సీనియర్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ మాక్ అసెంబ్లీ’ నిర్వహించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతల తీరుపై సోషల్ మీడియా వేదికగా రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఈటీవీ జబర్దస్త్ తో పోటీపడుతున్న డ్రామా రావు సెట్టు..స్కిట్టు..” అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీ నాయకులు డ్రామాలకు తప్పే దేనికీ పనికిరారని మరోసారి నిరూపించుకున్నారని ఆయన మండిపడ్డారు. పగటి వేషగాళ్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం “0” లాభం మాత్రమేనంటూ ఆయన తన పోస్టులో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.








