తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారిని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ (TTD) ఆహ్వానించింది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), బోర్డు మెంబర్లు జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మీ, జానకిదేవీ, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) సీఎం చంద్రబాబు గారిని కలిసి ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్, ఈవోలతో సీఎం చంద్రబాబు చర్చించారు.








