త్రిప్రయార్ శ్రీరామస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
సుప్రసిద్ధ శ్రీరామక్షేత్రం, నాలంబలం యాత్రలో ప్రధానమైన ఆలయాల్లో ఒకటైన కేరళం(Kerala) రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీరామస్వామి(Triprayar Sriramaswamy)ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దర్శించుకున్నారు. ఆలయంలో ఒకరోజు దీపారాధనకు విరాళం అందించడంతో పాటు దీపాలు వెలిగించాలి. శ్రీరామస్వామికి సంధ్యాకాలపు అర్చనలు చేశారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి చేపలకు ఆహారం అందించే సేవలో పాల్గొన్నారు. అంతకుముందు దేవస్థానం బోర్డు చైర్మన్ (Devaswom Board Chairman), ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పవన్ కల్యాణ్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ ఆలయానికి సమీపంలోనే పవన్ కల్యాణ్ ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్నారు.








