పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా కలెక్టర్లు కార్యాచరణ చేపట్టాలి : మంత్రి లోకేష్
విద్యాశాఖకు సంబంధించి వివిధ అంశాలపై కలెక్టర్లకు పలు సూచనలు చేసిన మంత్రి నారా లోకేష్
పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా కలెక్టర్లు కార్యాచరణ చేపట్టాలి
బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మరింతగా పెరిగేలా చూడాలి
పాఠశాల భవనాలు పటిష్టంగా ఉండాలి. నిర్మాణాలు నాణ్యంగా ఉండాలి
ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను వివిధ పరిశ్రమలతో అనుసంధానిస్తూ.. పరిశ్రమలకు తగిన నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా చేస్తున్నాం
నైపుణ్యం వెబ్ పోర్టల్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్కిల్ టూల్స్ కూడా అందుబాటులోకి తెస్తున్నాం
రాష్ట్రంలో అక్షరాస్యతతో పాటు డిజిటల్, ఫైనాన్షియల్ లిటరసీపైనా విద్యాశాఖ పని చేస్తోంది
పాఠశాలల్లోని విద్యార్ధులకు ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వయం రక్షణపైనా శిక్షణ ఇస్తున్నాం
కరిక్యులమ్ మార్పుపై రోడ్ మ్యాప్‌ను రూపొందించుకుని పని చేస్తున్నాం.








