అల్పపీడనంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్…హోంశాఖ మంత్రి అనిత కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ పై వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశా (South Odisha) – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు సమీపంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావం పై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత(Minister Anita) సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వనిర్ణయాలు తెలుసుకోవాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో తక్షణ సహాయక చర్యల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్(Control Room)లను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రజల ఫోన్లకు అప్రమత్తతా సందేశాలు పంపాలని తెలిపారు.
రానున్న మూడు రోజులపాటు ప్రజలు(People ) అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు(Fishermen) ఎవరూ వేటకు వెళ్లకూడదని హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన కంట్రోల్ రూమ్ నంబర్లను 112 (అత్యవసర కాల్), 1070 (టోల్ ఫ్రీ), 1800 425 0101 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.








