ఉద్యోగం పోయినా ఆర్థికంగా నిలబడాలంటే.. ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
ఉద్యోగం… అందరికీ అవసరమే. కుటుంబ పోషణకో, ఖర్చులకో, లేదా సోషల్ స్టేటస్ కోసం కూడా ఉద్యోగం ఉపయోగపడుతుంది. అయితే.. వివిధ కారణాల వల్ల ఉద్యోగం పోతే, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేస్తాయి. ఇప్పుడైతే EMI లు కూడా వుంటాయి. దీంతో ఆర్థిక పరిస్థితి అంతా తలకిందులైపోతుంది. ఉద్యోగం కోల్పోవడం అనేది మానసికంగా మరియు ఆర్థికంగా పెద్ద దెబ్బ. అయితే, ముందుచూపుతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
అత్యవసర నిధి ఏర్పాటు

అత్యవసరమైన నిధి ఏర్పాటు చేసుకోవడం : అత్యవసరమైన నిధి అలా ఏర్పాటు చేసుకొని, దానిని వాడుకోకూడదు. కనీసం 6 నెలల ఖర్చులు: మీ నెలకు అయ్యే కనీస ఖర్చులను (ఇంటి అద్దె, EMIలు, నిత్యావసరాలు, బిల్లులు) లెక్కించండి. కనీసం 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సురక్షితమైన ప్రదేశంలో సేవ్ చేసి ఉంచండి.ఈ మొత్తాన్ని సేవింగ్స్ ఖాతా లేదా లిక్విడ్ ఫండ్లలో ఉంచండి, తద్వారా అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
అధిక వడ్డీ అప్పులకు దూరంగా ఉండండి

ఉద్యోగం లేని సమయంలో క్రెడిట్ కార్డు వాడకం, పర్సనల్ లోన్స్ వంటి వాటికి దూరంగా వుంటే ఇంకా బాగుంటుంది. దీని ద్వారా ఖర్చులను కచ్చితంగా తక్కువ చేసుకోవచ్చు. అలాగే వీలైతే ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను ముందే తీర్చేయండి. ఉద్యోగం పోయినప్పుడు బ్యాంకులను సంప్రదించి ఈఎంఐల రీస్ట్రక్చరింగ్ లేదా కొంతకాలం మినహాయింపు (మొరటోరియం) గురించి మాట్లాడవచ్చు.
ఖర్చులు తగ్గించి, బీమా తీసుకోండి

అలాగే మన ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. కేవలం ఇల్లు ఖర్చు, హౌస్ రెంట్, ఆహారం, నెలవారీ సామాన్లు, మందులు వంటి అత్యవసర వాటికే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. మిగతా దుబారా వైపు వెళ్లకుంటే బాగుంటుంది. బయట తినడాలు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు, షాపింగ్, విహార యాత్రలను తాత్కాలికంగా నిలిపేయాలని.
ఉద్యోగం ఉన్నప్పుడు కంపెనీ ఇచ్చే హెల్త్ పాలసీపైనే పూర్తిగా ఆధారపడకండి. సొంతంగా ఒక మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. లేదంటే ఉద్యోగం పోయినప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తే చేతి డబ్బులన్నీ ఖర్చవుతాయి.








