స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న కియారా
హీరోయిన్లకు సంబంధించిన ప్రతి కొత్త ఫొటోషూట్ సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది. తాజాగా కియారా అదిరిపోయే స్టైలిష్ లుక్‌లో ఫొటోషూట్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల్లో ఆమె ఫార్మల్ అవుట్‌ఫిట్‌లో ఎంతో క్లాసీగా కనిపిస్తోంది. బేజ్ కలర్ బ్లేజర్, వైట్ షర్ట్, టైతో కూడిన ఈ లుక్‌కి వైడ్ లెగ్ ట్రౌజర్‌ను జత చేసి సింపుల్ యాక్సెసరీస్, లైట్ మేకప్‌తో తన లుక్‌ను మరింత ఎలిగెంట్‌గా మార్చుకుంది. లాంగ్ హెయిర్‌ను ఓపెన్‌గా వదిలి కియారా ఇచ్చిన పోజులు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. గ్లామర్‌తో పాటు క్లాస్‌ను మిక్స్ చేసిన ఈ ఫొటోషూట్‌లో ఆమె స్టైల్ సెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.








