అమెరికా మధ్యంతర ఎన్నికల్లో జోక్యానికి ఇరాన్ ప్రయత్నాలు.. ట్రంప్ సంచలన ఆరోపణలు..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సుదీర్ఘంగా సాగుతున్న ఇరాన్ యుద్ధం ముగింపు గురించి ఓ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే అన్న ట్రంప్(Donald Trump) .. తమ దేశంలో మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాతే అన్నారు. స్తుతం వంద ప్రడాలర్లకు చేరిన చమురు
ధరలు సైతం అప్పుడే తగ్గుతాయని అంచనా వేశారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా బలగాలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయడంతో.. టెహ్రాన్ ఇక ఎక్కువకాలం దాడులను తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. తమ మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇరాన్ (Iran) ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో ఇరాన్ సరికొత్త నిబంధనలను ప్రకటించింది. అమెరికా మద్దతుతో జలసంధిలో వేరే మార్గంలో ప్రయాణిస్తోన్న నౌకలను ఆంక్షల జాబితాలో చేరుస్తామని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటీవల యూఎస్ నౌకలు, 8 ట్యాంకర్లపైన ఐఆర్జీసీ దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్‌పై విమర్శలు గుప్పించారు. మరోవైపు, అమెరికా కూడా టెహ్రాన్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది. దాంతో జోర్డాన్‌లోని యూఎస్ స్థావరంపై ఇరాన్ ప్రతిదాడులు చేసింది. ఈ ఘటనలతో హర్మూజ్‌లో నౌకల రవాణా మరోసారి ప్రమాదంలో పడింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లు దాటింది. కాగా.. తాము ఇరాన్‌తో చర్చలు కోరుకోవడం లేదని, అయితే ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని మాత్రం పక్కనపెట్టలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్ (USA-Iran) దాడులు చేయడంతో పలు సైనిక విమానాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఏ-10 థండర్‌బోల్ట్ విమానంతో పాటు ఎనిమిది ఎఫ్-15 యుద్ధ విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇరాన్ (Iran) దాడులను అడ్డుకునేందుకు అమెరికా బలగాలు 30 పాట్రియాట్ క్షిపణులను మోహరించాయని తెలిపింది. జోర్డాన్‌లోని ఎయిర్‌బేస్ నుంచి పదుల సంఖ్యలో అమెరికా విమానాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో ఈ బేస్ కీలకమైందిగా చెప్పవచ్చు.







