తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉద్రికత్త .. బీఆర్ఎస్వీ ఆందోళన
తెలంగాణ అసెంబ్లీ(Assembly) ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్వీ(BRSV) కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని ఎల్బీ స్టేడియం (LB Stadium) వద్దే పోలీసులు ( Police) అడ్డుకున్నారు. జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘం, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ముట్టడికి వచ్చిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) సహా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.








