తాతా మధు, నవీన్ కుమార్ బెయిల్ రద్దు చేయండి
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు (Tata Madhu), నవీన్ కుమార్ రెడ్డి (Naveen Kumar Reddy)కి లభించిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సైఫాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టు (Nampally Court)లో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విధించిన బెయిల్ షరతులను నిందితులు ఉల్లంఘించారని పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన అనంతరం కోర్టు నిబంధనలకు బేఖాతరు చేస్తూ వారు మీడియా పాయింట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు, డిజిటల్ ఆధారాలను సమర్పించారు.
ఇవి కూడా చదవండి
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోరారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ( Gaddam Prasad Kumar)ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు నమోదై ఉన్నాయని పోలీసులు గుర్తు చేశారు. అందుకే ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు బదిలీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు.








