అందరు మంత్రులు తుమ్మలలా ఉండాలి : బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
నాయకుడంటే మంత్రి తుమ్మల(Minister Tummala)లా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూరగాయల సాగుపై ఆయన మాట్లాడుతూ ఒకరోజు ఆదివారం పలువురు రైతులు ఓ సమస్య తీసుకొని మా ఇంటికి వచ్చారు. నేను మంత్రికి ఫోన్( Phone) చేశా. లిఫ్ట్ చేయలేదు. 15 నిమిషాల తర్వాత ఆయనే ఫోన్ చేసి సమస్యను సావధానంగా విని మధ్యాహ్నం 3 గంటలలోపు పరిష్కారమవుతుందని చెప్పారు. మళ్లీ ఒంటి గంటకు ఫోన్ చేసి కలెక్టర్ (Collector)తో మాట్లాడానని, ఇక సమస్య ఉండని చెప్పారు. పార్టీలు మారుతుంటారు పదవులు వస్తాయి పోతాయి. కానీ ఆదివారమైనా ఒక కొత్త ఎమ్మెల్యే సమస్య చెబితే ఆయన స్పందించిన తీరు నాకు సంతోషాన్నిచ్చింది. అందరు మంత్రులు ఆయనను అనుసరించాలి అని ఆకాంక్షించారు.







