నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను ఆవిష్కరించిన మంత్రి లోకేష్
అమరావతి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని.. స్వర్ణోత్సవ వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను గురువారం సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.గంగాధర రావు, రెక్టార్ ఆర్.శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ జి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.








