సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మధుయాస్కీ గౌడ్
ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) నూతన చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ (Madhu Yaskhi Goud)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)లు అభినందించారు. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సీఎల్పీ సమావేశం సందర్భంగా ఆయన వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులు (Ministers) అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధుయాస్కీకి శుభాకాంక్షలు తెలియజేసి, అభినందించారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ (Gaddam Prasad Kumar)ను మధుయాస్కీగౌడ్ అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.







