బీఆర్ఎస్ కుట్రలను బలంగా తిప్పికొట్టాలి: సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్
సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తున్నాం
ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ ఫామ్ హౌస్ లో కెసీఆర్ అధ్యక్షతన సభను సజావుగా జరగకుండా కుట్ర చేశారు
అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించిమూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారు
అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం చేశారు
శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు
నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు
ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా
జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టడం జరిగింది
సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనండి
సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలి
ప్రజలు ఇచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్ లో రాజకీయంగా రాణించలేరు
అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నాం
అసెంబ్లీలో సెంట్రల్ హాల్ ను ప్రారంభించుకుని దుద్దిళ్ల శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నాం
సభలో నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలి
అసెంబ్లీ జరిగినన్ని రోజులు సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండాలి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి కాంగ్రెస్ కు నష్టం చేకూర్చాలని చూస్తున్నారు
కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీత లక్ష్మా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా?
పోలీస్ సిబ్బందిలో కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కనిపించినట్టున్నారు
అంత ఆక్రోశంతో అధికారులపై దాడులు చేశారు
దేశానికి మనం చేసిన జనగణన రోల్ మోడల్
ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత
తెలంగాణ నమూనాను జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
SIR పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది
ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఈ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి
మీ ప్రతీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుంది
మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది
SIR అంశాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకోండి
దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లు గా తేల్చారు, కానీ ఓటర్ల జాబితా మాత్రం 88 కోట్లుగా చూపుతున్నారు
దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి
ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉంది
1000 రోజుల పాలనకు సహకరించి నందుకు మీ అందరికీ ధన్యవాదాలు
మీ సహకారం తో దేశం లో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు తీసుకువచ్చాం..







