కాలేజీలపై విజిలెన్స్ ఎంక్వైరీని అడ్డు పెట్టుకుని కెసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు : సీఎం రేవంత్రెడ్డి
గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై కెసీఆర్ వ్యాఖ్యలను సభలో వినిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ ఏం చేశారో ఎవరికీ తెలియదు
తనకు నచ్చిన కళాశాలలకు ఫీజులు పెంచి, నచ్చని కళాశాలలకు ఫీజులు పెంచకుండా పక్కన పెట్టారు
పదేళ్లు ఫీజులు ఇవ్వకపోయినా వీళ్లు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు.. ఒకరోజు ధర్నాలు చేయలేదు
నేను వచ్చాక మాత్రం నాపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు
కేసీఆర్ లా నేను అణచివేస్తలేననా? లేక కెసీఆర్ నే వారిని ఉసిగొల్పుతున్నారా?
జెన్యూన్ కళాశాలలకు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తాం
కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రం నిబంధనలను పాటించాల్సిందే
ఫీజు రీయింబర్స్ మెంట్ విద్యార్థుల కోసం.. యాజమాన్యాల కోసం కాదు
కేసీఆర్ సన్నిహితుడికి చెందిన ఒక యూనివర్సిటీ ఖాతాలో రూ.400 కోట్లపైగా డబ్బు ఉంది
ఇది ఇక్కడి నుంచి వచ్చింది? విద్య ఏమైనా వ్యాపారమా?
సుప్రీమ్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆ కళాశాల లోపలికి మా అధికారులను రానివ్వలేదు
పాలమ్మి, పూలమ్మితే వందల కోట్లు వస్తాయని మాకు తెలియదు
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఎంక్వైరీలో క్లీన్ చిట్ వచ్చిన కళాశాలలకే ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తాం
విద్యార్థులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దు..
వాళ్ళ పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకుంటారు
పేద విద్యార్థులకు మంచి చేస్తామంటే మాత్రం అడ్డుకుంటారట
టీషర్టు వేసుకుంటే యువకుడైపోతారా? కొందరు పుట్టుకతోనే వృద్ధులని శ్రీశ్రీ ఏనాడో చెప్పారు
తెలంగాణ ప్రజల బాధలను నా బాధగా భావించి సమస్యలు పరిష్కరిస్తున్నా
కెసీఆర్, కేటీఆర్ మాత్రం అధికారం కోల్పోయిన వాళ్ల బాధనే తెలంగాణ ప్రజల బాధ అనుకుంటున్నారు
ఫామ్ హౌస్ కుట్రలను తిప్పి కొట్టండి
ఫామ్ హౌస్ కుట్రలు తెలంగాణలో చెల్లవు








