కలెక్టర్లు ప్రజెంట్ చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను ప్రశంసించిన సీఎం చంద్రబాబు
జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ను కలెక్టర్ల కాన్ఫరెన్సులో ప్రజెంట్ చేసిన వివిధ జిల్లాల కలెక్టర్లు.
జిల్లాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాల్ని వివరించిన అల్లూరి, చిత్తూరు, అనంతపురం, బాపట్ల, కర్నూలు, ప్రకాశం, శ్రీసత్యసాయి కలెక్టర్లు
స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ మోడల్-భవిష్యత్ క్రీడాకారులను తయారు చేసేలా కార్యక్రమం రూపొందించిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్
కలెక్టర్లు ప్రజెంట్ చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను ప్రశంసించిన ముఖ్యమంత్రి
కలెక్టర్లు కొత్త విధానాలను ఆవిష్కరించడం… వినూత్నంగా ఆలోచించడం ఆనందంగా ఉందన్న సీఎం చంద్రబాబు
అల్లూరి కలెక్టర్ ప్రజెంట్ చేసిన మోడల్ ను ఏజెన్సీ ఏరియాల్లో అమలు చేయాలని… మిగిలిన జిల్లాల కలెక్టర్లు ప్రజెంట్ చేసిన అంశాలను అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• అల్లూరి జిల్లాలో ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో ఆరు నెలలుగా డ్రోన్లు విశిష్టమైన సేవలు అందిస్తున్నాయి.
• ప్రస్తుతం 2 డ్రోన్లు సేవలు అందిస్తున్నాయి. వీటిని 10 వరకూ పెంచాలి.
• ఇతర ఏజెన్సీ జిల్లాల్లోనూ డ్రోన్ సేవల్ని విస్తరించండి. డ్రోన్ ఆపరేషన్స్ కు సంబంధించి గైడ్ లైన్స్ కూడా రూపోందించండి.
• అతి తక్కువ వ్యయంతోనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టండి.
• క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేలా అనంతపురం జిల్లా కలెక్టర్ వినూత్నంగా కొత్త కార్యక్రమం చేపట్టారు.
• విద్యార్ధులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించారు.
• జిల్లా స్థాయిలో క్రీడా పాఠశాలల ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి.
• అమరావతి, విశాఖ, తిరుపతి ప్రాంతాల్లో క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేయండి.
• ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు ఈ క్రీడల్లో పాల్గోనేలా శిక్షణ ఇవ్వండి.
• బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రజెంట్ చేసిన స్వర్ణ భవిత మోడల్ ను మరింత మెరుగు పర్చి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించండి.
• చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రజెంట్ చేసిన డిజిటల్ లెర్నింగ్ మోడల్ ను అధ్యయనం చేసి ఇతర ప్రాంతాల్లోని విద్యార్ధులకు అందించే అవకాశాలను పరిశీలించాలి.
• ఏఐ టీచర్ ద్వారా పాఠాలను బోధించే అంశాలను కూడా అందుబాటులోకి తేవాలి.
• కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రజెంట్ చేసిన పీఎండీఎస్ మోడల్ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు ఉపకరిస్తుంది.
• రైతులకు ఆదాయంతో పాటు పశుదాణాను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
• ఆదాయం, ఉష్ణోగ్రతల తగ్గింపు, కీటకాల నియంత్రణ తదితర అంశాలను అధ్యయనం చేయాలి.
• ప్రకాశం జిల్లా కలెక్టర్ వేస్ట్ టూ వెల్త్ పేరుతో చేపట్టిన కార్యక్రమం బాగుంది.
• రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను కాంపోస్టుగా మార్చేలా గైడ్ లైన్స్ రూపొందించండి.
• సత్యసాయిజిల్లా జిల్లా కలెక్టర్ చేపట్టిన ప్రాజెక్ట్ పునర్జీవం పర్యావరణ హితంగా ఉంది.
• ప్రాజెక్టు పునర్జీవంలో భాగంగా కార్బన్ న్యూట్రల్ మోడల్ గా ఉన్న బయోచార్ ను రైతులకు అందించేలా ఓ కార్యక్రమం చేపట్టండి.
• తక్కువ వ్యయంతో భూమిని సారవంతంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించండి.








