దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు.. ఆ అవసరం నాకేంటి?: సీఎం రేవంత్‌రెడ్డి
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
తెలంగాణ విద్యా విధానంపై సభలో చర్చ జరగడం ఒక శుభ పరిణామం
సభ్యుల సూచనలపై సమీక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది
దేశ తొలి ప్రధాని నెహ్రూ గారు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెండు అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు
దేశంలోని ఏ విద్యా సంస్థ అయినా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వేసిన పునాదులపైనే నిర్మితమైంది
ఇప్పుడున్న చాలా యూనివర్సిటీలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవే
విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నా
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీపెక్ సర్వే నిర్వహించింది
సామాజిక వెనుకబాటుకు ఆస్తులు అంతస్తులు కాదు… విద్య లేకపోవడమే సామాజిక వెనుకబాటు తనానికి కారణమని సర్వేలో తేలింది
ప్రపంచంతో పోటీ పడాలంటే విద్య విధానంలో తీసుకు రావాల్సిన అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది
తెలంగాణ నూతన విద్యా విధానం రూపొందించేందుకు విద్య కమిషన్ ను ఏర్పాటు చేశాం
విద్యా కమిషన్ అందించిన రిపోర్ట్ ను పరిశీలించేందుకు కేకే నేతృత్వంలో ఒక కమిటీని నియమించాం
మీ సూచనలు, సలహాలను కేశవరావు గారికి అందిస్తే ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది
విద్య కోసం 15 శాతానికి బడ్జెట్ ను పెంచడమే మా లక్ష్యం
పూర్తిస్థాయి విద్యా శాఖ మంత్రి లేడని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు
ముఖ్యమంత్రి ఆ శాఖను నిర్వహిస్తున్నారంటే ఆది అత్యంత ప్రధానమైనదని అర్థం
ముఖ్యమంత్రిగా నేను ఎడ్యుకేషన్ సమీక్ష చేస్తే మొత్తం సిస్టమ్ వచ్చి సమీక్షలో ఉంటుంది
ఈ మాత్రం తేడా కూడా సభ్యుడికి తెలియకపోవడం బాధాకరం
నాకు విద్యా శాఖపై ఒక ప్యాషన్ ఉంది
2023-24 బడ్జెట్ లో బీఆరెస్ ప్రభుత్వం
విద్యా శాఖ కు రూ.19,093 కోటల కేట్లయిస్తే..
మా ప్రభుత్వం 2024-25 బడ్జెట్ లో రూ.21,292 కోట్లు కేటాయించింది
2025-26 బడ్జెట్ లో ఆ మొత్తాన్ని రూ.23,108 కోట్లకు, 2026-27 బడ్జెట్ లో రూ.26,647 కోట్లకు పెంచాం.
కేవలం మూడేళ్లలో విద్యా శాఖ బడ్జెట్ ను రూ.7,554 కోట్లకు పెంచాం.
మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 రోజుల్లోనే 10,006 మంది టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేశాం
చిన్న ఆరోపణ లేకుండా ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం
గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7857 మంది టీచర్లను నియమించారు
జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరానికి కూడా దృష్టిలో ఉంచుకుని విద్యా విధానం తీసుకొస్తున్నాం
దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, తలరాతలు మార్చేది విద్యా అని నమ్మి విద్యా శాఖ నా దగ్గర పెట్టుకున్నా
ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్ ను తీసుకొస్తున్నాం
కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు చేసినపుడు కొన్ని వివాదాలు జరుగుతాయి
అలాంటిదే పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన జీవో ఎంఎస్ నెం.97
నేను విద్యా శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మంది పెరిగారు
ఇది విద్యా శాఖ మంత్రిగా నా పనితీరుకు నిదర్శనం
ప్రైవేటు విద్యా వ్యవస్థలో రెండున్నరేళ్లకే పాఠశాలకు పంపిస్తున్నారు
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్లకు పాఠశాలకు పంపిస్తున్నారు
అందుకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు
నర్సరీ, ఎల్.కే.జీ విధానంతో పాటు ఇంగ్లీష్ భాష కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు
అందుకే ప్రభుత్వం పాఠశాలల్లో మొట్ట మొదటిసారిగా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం
ఈ ఏడాది 64 వేల మంది ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నాం
నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం
సెంట్రలైజ్డ్ కిచెన్స్ డిజైన్ చేసి నాణ్యమైన హైజెనిక్ బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం.
విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నాం
పదేళ్లు వాళ్లు పట్టించుకోకపోతే మేం ఆధికారంలోకి రాగానే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాం.
ఒక రేవంతన్నగా మేం ఇన్ని చేసినా ఎప్పుడూ చెప్పుకోలేదు
పాలిటెక్నిక్ కాలేజీలు ప్రైవేటు పరం అవుతాయని దుష్ప్రచారం చేస్తున్నారు
పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే ప్రసక్తే లేదు
ఐటీఐ లను ఏటీసీలుగా మార్చి టాటా సహకారంతో నైపుణ్యాన్ని అందిస్తున్నాం
అలాగని ఐటీఐలను ప్రైవేటు పరం చేసినట్టా?
ఎటీసీలో చదివే వారికి ప్రతీ నెల 2 వేలు స్కాలర్ షిప్ అందించాలని చెప్పాం
మేం ఒక మంచి సంకల్పంతో పని చేస్తుంటే కొంతమంది విద్యార్థుల్లో అపోహలు కలిగిస్తున్నారు
భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని ప్రచారం చేస్తున్నారు
ప్రభుత్వమే అదనంగా 282 ఎకరాల రెవెన్యూ భూమిని ఏటీసీలకు బదలాయించింది
ఒక్కో ఏటీసీ పై రూ.46 కోట్లు ఖర్చు చేశాం
పాలిటెక్నిక్ కాలేజీలు ప్రైవేటుపరం చేయబోం
ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి
కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి యంగ్ ఇండియా యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తున్నాం
సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడమే ప్రభుత్వ ఉద్దేశం
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి, పరిశ్రమల భాగస్వామ్యంతో ఆధునిక ల్యాబొరేటరీలు, పరికరాలు, శిక్షణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం.
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెంచాలని ఈ నిర్ణయం తీసుకున్నాం.
ఆఈ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి కొత్త రంగాలకు అనుగుణంగా కోర్సులను ఆధునీకరిస్తాం.
పాలిటెక్నిక్ విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలానే మా తపన.
సాంకేతిక విద్య–నైపుణ్యాభివృద్ధి విభాగం అనుసంధానంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్న మౌలిక వసతులు, ల్యాబ్‌లు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాం
విద్యార్థులలో అపోహలను తొలగిస్తాం, జీవోలో సవరణ కావాలంటే చేస్తాం
ఆఈఛ్టే అప్రూవల్ లేదని అంటున్నారు.. స్కిల్స్ యూనివర్సిటీకే ఆ అప్రూవల్ తీసుకొస్తాం
మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్న హరీష్ రావు ఇపుడు ఆ వ్యవస్థనే ముందుకు వెళ్ళకుండా కుట్ర చేస్తున్నారు
కడుపులో కుల్లు, పేద పిల్లలపై ద్వేషంతో ఆ కుటుంబం కుట్ర చేస్తోంది
పేద పిల్లలకు మేం అన్యాయం జరగనివ్వం.. వారి భవిష్యత్ బాగుండాలనే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం చేసే ఈ చర్యలను మీరు అడ్డుకోండి
దుర్మార్గం వైపు, అహంకారం వైపు ఉన్నందునే పది తలల రావణుడు కూడా రాముడి చేతిలో మరణం తప్పలేదు
బీఆరెస్ నేతలకు అధికారం పోయినా అహంకారం ఇంకా పోలేదు
ఫీజు రీయింబర్సుమెంట్ కాంగ్రెస్ పేటెంట్..
గత ప్రభుత్వం పోతూ పోతూ ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 5430 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు
వారు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన వాటిలో రూ. 1410 కోట్లు మేం చెల్లించాం.
మా ప్రభుత్వం వచ్చాక కోతగా రూ.1475 కోట్లు చెల్లించాం
ఈ 32 నెలల్లో రూ. 3488 కోట్లు ఫీజు రీయింబర్సుమెంట్ కోసం చెల్లించాం.








