ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏ(DA)లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ (Finance Department) ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబర్ జీతానికి కలిపి చెల్లించాలని పేర్కొంది. 1.82 శాతం డీఏను 2025 జనవరి 1 నుంచి చెల్లించనుంది. 20 నెలల బకాయిలు 2028 జనవరి, మార్చి మే, జులైలో ఇవ్వనుంది. 2.73 శాతం డీఏను 2024 జులై 1 నుంచి చెల్లించనుంది. 26 నెలల బకాయిలు 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబరులో జమ చేయనుంది. పింఛనుదార్లకు కూడా ఇదే షెడ్యూల్లో డీఏ బకాయిలు (DA arrears) చెల్లించాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ( Piyush Kumar) పేర్కొన్నారు.








