ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే నెం.1 స్థానం : సీఎం చంద్రబాబు
కేంద్ర సహకారం, రాష్ట్ర సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో నెం. 1 స్థానం దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ (Critical Care Block), ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను కేంద్ర మంత్రి జేపీ నడ్డా (J.P. Nadda)తో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ 500 బెడ్లతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. సంజీవని ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్‌గా మారబోతోందన్నారు.
ప్రధాని మోదీ ( Modi) ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat)గా మారబోతోంది. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలామందికి ప్రయోజనం చేకూరుతుంది. అర్హులైన వారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. జేపీ నడ్డా నాయకత్వలో ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. ఆరోగ్య రంగంలో పెనుమార్పులకు డబుల్ ఇంజిన్ సర్కారే కారణం.2047 నాటికి ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉండాలి అని అన్నారు.








