సుద్దాల అశోక్ తేజకు తెలంగాణ తెలుగు తేజం పురస్కారం
తెలుగు భాషా సంరక్షణ సంఘం- తెలంగాణ సాహితీ సంస్థ ఏటా ప్రధానం చేస్తున్న రాష్ట్ర స్థాయి బుర్ర నర్సమ్మ –లింగారెడ్డి (Burra Narsamma-Lingareddy) స్మారక తెలంగాణ తెలుగు తేజం (Telangana Telugu Tejam ) సాహిత్య పురస్కారం -2026కు ప్రముఖ కవి, సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ (Suddala Ashok Teja) ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పురస్కార కమిటీ ఛైర్మన్ డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి (Dr. Burra Madhusudan Reddy,), సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి వెల్లడించారు. ఈ నెల 22న కరీంనగర్ లో పురస్కార ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టిబిడ్డలు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.








