ఖైరతాబాద్‌కు పోటెత్తిన భక్తులు.. తొలి రోజు ఎంత మంది దర్శించుకున్నారంటే?
ఖైరతాబాద్ గణేష్ (Khairatabad Ganesh)ను దర్శనానికి భక్తులు తొలిరోజే భారీగా తరలివచ్చారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఉదయం గవర్నర్ (Governor) దంపతులు స్వామివారికి తొలిపూజ నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరగడంతో ఖైరతాబాద్ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 75 వేల మందికిపైగా భక్తులు గణేష్‌ను దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.
ఖైరతాబాద్ గణనాథుడిని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), ఎంపీ ఈటల రాజేందర్, అనిల్‌కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖుల రాకతో భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 25న శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనం నిర్వహించనున్నారు.








