పోలీసుల విచారణకు హాజరైన కేటీఆర్ పీఏ, పీఆర్వో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పీఏ మహేందర్ రెడ్డి (Mahender Reddy), పీఆర్వో మహేశ్ (Mahesh) పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నెల 7న అసెంబ్లీ గేటు (Assembly gate) వద్ద జరిగిన ఘటనపై సైఫాబాద్ పోలీసులు ( Saifabad police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ కేసులో హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వడంతో సోమవారం వీరిద్దరూ హాజరయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు, వారి పాత్ర పై పోలీసులు ఆరా తీయనున్నారు.








