ఎర్రవల్లి ఘటన .. ఏడుగురి అరెస్ట్ చేసిన పోలీసులు
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ పామ్ హౌస్ (KCR farmhouse) వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరదరాజ్‌పూర్ ( Varadarajpur)కు చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు ఆరుగురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. విజయవాడ ( Vijayawada)లోని ఓ లాడ్జిలో ఉండగా వారిని పట్టుకున్నట్లు సమచారం. ఆరుగురి ఫోన్లు స్విచాఫ్‌లో ఉండగా, మరొకరు ఆన్ చేయడంతో పోలీసులు లొకేషన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి గజ్వేల్ (Gajwel)కు తరలించారు. నిందితులను మెజ్రిస్టేట్ ముందు హాజరుపరిచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని సిద్దిపేట జైలు(Siddipet jail)కు తరలించారు. దళితులను అవమానించారని కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫాంహౌస్ పరిసరాల్లో ఇప్పటికే ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు సేకరించారు.








