ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ లో ప్రిన్స్ రహీమ్ అగాఖాన్-వీ (Prince Rahim Aga Khan V) తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy,) భేటీ అయ్యారు. గ్లోబల్ సమిట్ (Global Summit,)కు హాజరుకావాలని ఆయన్ను సీఎం ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అగాఖాన్ ఫౌండేషన్ పై అత్యంత గౌరవముందని తెలిపారు. వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగాఖాన్ పౌండేషన్ది అత్యంత కీలకపాత్ర. ఫౌండేషన్ సాయంతో మండలి భవనం, కుతుబ్ షాహీ టూంబ్స్ (Qutub Shahi Tombs)ను పునరుద్ధరించుకున్నాం. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. సిటీ కాలేజ్, ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) భవనాల పునరుద్ధరణకు సాయం కోరుతున్నాం. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నాం. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు అని సీఎం తెలిపారు.








