నచ్చిన పనులపైనా ఆసక్తి తగ్గిపోవడం… ఈ మానసిక స్థితికి సంకేతం!
మనిషి మనస్సు చంచలం. స్వభావం కూడా చంచలమే. మనస్సు ఎప్పుడూ ఒకే దానిని కోరదు. సెకనుకో, నిమిషానికో, రోజుకో, లేదా సంవత్సరాలకో.. చంచలంగా మారిపోతుంది. ఒక రోజు ఇష్టమైన పదార్థమో, వస్తువో.. కొన్ని రోజులకు దానిపై ఇష్టత తగ్గిపోతుంది. అలాగే హాబీల విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఆ హాబీ వుండేది.. కానీ ఇప్పుడు అది లేదు.. వేరే హాబీ పెట్టేసుకున్నా అని అంటుండటం మనం వింటూనే వుంటాం.
అన్హెడోనియా లక్షణాలు

అలా మన మన ఆసక్తులను గానీ, హాబీలను కానీ కోల్పోవడాన్ని సైకాలజీలో ‘‘అన్హెడోనియా’’ అంటాంరు.ఇది కేవలం బద్ధకం లేదా మూడ్ ఆఫ్ అవ్వడం మాత్రమే కాదు. దీని వెనుక లోతైన మానసిక, శారీరక కారణాలు ఉంటాయని సైకాలజిస్టులు చెబుతుంటారు. అలా మార్చేసుకోవడం మంచిదా? చెడ్డదా? అంటే.. దీనిపై రకరకాల అభిప్రాయాలు వున్నాయి.
అయితే.. ఈ అన్హెడోనియా (ఆస్తులను కోల్పోవడం) అనేది మనకు నిత్యం సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే ‘‘డొపమైన్’’ అనే హార్మోన్ ఉత్పత్తి మెదడులో తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. డొపమైన్ లెవెల్స్ పడిపోతే, ఎంత మంచి పని చేసినా మెదడు దానికి “రివార్డ్” లేదా సంతోషాన్ని ఇవ్వలేదు. దీని ద్వారా ఆ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇలాంటి సమస్య వస్తుంది.
ఒత్తిడి, మానసిక అలసట

ఇవి కూడా చదవండి
అలాగే ఇలా ఆసక్తులు కోల్పోవడం వెనుక మానసికంగా చాలా అలసిపోవడం, మానసికంగా చాలా ఒత్తిడికి గురి కావడం వల్ల కూడా జరుగుతుంది. లేదా పనిభారం కూడా ఓ కారణం కావొచ్చు. ప్రస్తుత కాలంలో సాంకేతికత బాగా పెరిగిపోయిన తర్వాత, ఒత్తిళ్లు వచ్చేస్తున్నాయి. కంపెనీలలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో రొటీన్ లైఫ్ వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. అందుకే మనకు ‘‘jumping from routine అనే పద్ధతి ఒకటి వుంది. రొటీన్ లైఫ్ గడపడం వల్ల మనసు అలసిపోతుంది. ఈ బర్నౌట్ స్థితికి చేరినప్పుడు, శరీరం మరియు మనసు తమను తాము రక్షించుకోవడానికి అన్నిటికీ దూరంగా జరిగిపోతాయి. దాంతో దేనిపైనా ఇంట్రెస్ట్ ఉండదు.
అన్హెడోనియా కారణాలు, బయటపడే మార్గాలు

అలాగే ఇలా విషయాలపై ఆసక్తులను కోల్పోవడం వెనుక మరో కారణం కూడా వుందట. దీనినే ‘‘క్లినికల్ డిప్రెషన్’’ అంటుంటారు. ప్రాథమిక లక్షణాలలో ఇది కూడా ఒకటి. ఇది కేవలం బాధగా ఉండటం మాత్రమే కాదు, జీవితంలో శూన్యత ఆవరించినట్లు అనిపిస్తుంది. జీవితం మొత్తం అయిపోయింది, ఇక చేసేదేమీ లేదు.. అన్న స్థాయికి ఇది తీసుకెళ్తుంది.
అలాగే భావోద్వేగాలకు స్పందించకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. గతంలో ఏదైనా పెద్ద మానసిక గాయం (Trauma) జరిగినప్పుడు లేదా తీవ్రమైన బాధను అనుభవించినప్పుడు, మనసు మళ్లీ గాయపడకూడదని ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. దీనివల్ల బాధే కాదు, సంతోషం, ఆసక్తి లాంటి పాజిటివ్ ఎమోషన్స్ కూడా మొద్దుబారిపోతాయి.
ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే.. యోగా బాగా ఉపకరిస్తుంది. యోగా, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు బాగా ఉపకరిస్తాయి. అలాగే యోగాలో భాగమైన కపాలభాతి, శారీరక వ్యాయాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఒకేసారి పెద్ద పనులు కాకుండా, రోజులో కనీసం ఓ 10 నిమిషాలైనా నచ్చిన పనిని చేయాలి.








