15th September2026

_________

- Bhuvana

ఇంట్లో ఉన్న పదార్థాలతోనే టేస్టీ స్నాక్.. సాయంత్రం తప్పక ట్రై చేయండి! 

మఖానాను పాన్‌లో కొద్దిగా నెయ్యితో వేయించి, ఉప్పు, కారం, మిరియాల పొడి కలిపితే కరకరలాడే స్నాక్ సిద్ధం.

మసాలా మఖానా

వేయించిన వేరుశెనగలకు ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం, కారం, ఉప్పు కలిపితే రుచికరమైన చాట్ రెడీ.

స్పైసీ పీనట్ చాట్

బ్రెడ్‌పై ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, మసాలాలు వేసి తవాపై రెండు వైపులా టోస్ట్ చేస్తే వేడి వేడి స్నాక్ సిద్ధం.

బ్రెడ్ మసాలా టోస్ట్

ఉడికించిన స్వీట్ కార్న్‌లో నిమ్మరసం, మిరియాల పొడి, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు కలిపి వెంటనే సర్వ్ చేయండి.

స్వీట్ కార్న్ చాట్

ఓట్స్‌లో తరిగిన కూరగాయలు, పెరుగు, మసాలాలు కలిపి చిన్న టిక్కీలుగా చేసి తవాపై తక్కువ నూనెతో కాల్చండి.

ఓట్స్ వెజిటబుల్ టిక్కీ

మొలకలకు ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలా కలిపితే ఫ్రెష్‌గా, ఫైబర్ ఉన్న సింపుల్ స్నాక్ సిద్ధం.

మొలకల చాట్

ఉడికించిన ఆలూ ముక్కలకు ఉల్లిపాయ, నిమ్మరసం, కారం, ఉప్పు, చాట్ మసాలా కలిపితే టీతో తినేందుకు టేస్టీ చాట్ రెడీ.

ఉడికించిన ఆలూ చాట్