15th September 2026

_________

- Bhuvana

దోమలను తరిమికొట్టే నేచురల్ చిట్కాలు

రసాయనాలతో పని లేకుండా, ఇంట్లోని సహజసిద్ధమైన వస్తువులతో దోమలను ఇళ్ల నుంచి ఇట్టే తరిమికొట్టే సింపుల్ టిప్స్!

లెమన్ గ్రాస్ సువాసన దోమలకు అస్సలు పడదు. దీని నూనెను దీపంలా వెలిగిస్తే దోమలు దరిచేరవు.

లెమన్ గ్రాస్ ఆయిల్

కొద్దిగా హారతి కర్పూరాన్ని నూనెలో వేసి వెలిగించడం వల్ల వచ్చే పొగకు దోమలు ఇల్లు వదిలి పారిపోతాయి.

కర్పూరం మరియు నూనె

వేప నూనె మరియు కొబ్బరి నూనెను సమపాళ్లలో కలిపి శరీగానికి రాసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి.

వేప నూనె, కొబ్బరి నూనె

వెల్లుల్లి రెబ్బలను నజ్జి నీళ్లలో మరిగించి ఆ నీటిని ఇంట్లో స్ప్రే చేస్తే దోమలు రాకుండా ఉంటాయి.

వెల్లుల్లి వాసన

ఇంట్లో తులసి మొక్కలను పెంచడం వల్ల వాటి సహజ సువాసనకు దోమలు మరియు కీటకాలు దూరంగా ఉంటాయి.

తులసి మొక్కల శక్తి

నిమ్మకాయను సగానికి కోసి అందులో లవంగాలను గుచ్చి గదుల్లో పెడితే దోమల బెడద పూర్తిగా తగ్గుతుంది.

నిమ్మకాయ, లవంగాలు

పుదీనా నూనె లేదా పుదీనా ఆకుల రసాన్ని నీళ్లలో కలిపి ఇంటి మూలల్లో చల్లితే మంచి ఫలితం ఉంటుంది.

పుదీనా ఆకుల స్ప్రే

సిట్రోనేలా ఆయిల్ సువాసన దోమలను ఇళ్లలోకి రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

బైట్రోనేలా ఆయిల్ డిఫ్యూజర్

ఇళ్ల చుట్టూ నీరు నిల్వకుండా చూసుకోవడం, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

శుభ్రత పాటించండి