పదే పదే ఆలోచనలతో మానసికంగా అలిసిపోతున్నారా? ఈ పద్ధతులు పాటించి బయటపడండి!
Over Thinking…అతిగా ఆలోచించడం, పదే పదే వరదలా ఆలోచనలు రావడం.. ఈ మధ్య అందరికీ వచ్చి పడుతున్న సమస్య. దీంతో మనిషి మానసికంగా చాలా తొందరగా అలిసిపోతున్నాడు. దీంతో కుటుంబ సమస్యలు, భార్య భర్తల మధ్య సంబంధాలు ఇబ్బందుల్లోకి వెళ్లిపోవడం వంటివి ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి వాటి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం, అలాగే కొన్ని ఆచరణాత్మక పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం.
భవిష్యత్తు భయం, గతం గురించిన ఆలోచనలే ప్రధాన కారణం

అయితే మానసిక నిపుణులు చెబుతున్న ప్రకారం.. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం, భయపడటం వల్లే ఈ సమస్య వచ్చి పడుతోందని చెబుతున్నారు. దీనితో పాటు గతంలో జరిగిన విషయాలు, లేదా కోల్పోయిన విషయాల గురించి పదే పదే అదే పనిగా ఆలోచించడం వల్ల కూడా ఈ సమస్య వచ్చిపడుతోంది. అలా జరిగి వుంటే బాగుండేది, ఇలా జరిగి వుంటే బాగుండేది అని పదే పదే మనలో మనమే ఆలోచించడం వల్ల కూడా ఆలోచనలు పదే పదే సుడుల్లా తిరుగుతుంటాయి.
అంతేకాకుండా ఈ మధ్య మరో పదం కూడా విరివిగా అందుబాటులోకి వచ్చింది. Perfectionism. ఇది ముఖ్యంగా యువతను, కెరీరిజంలో బాగా పేరుకుంది. బాగా ప్రాచుర్యంలో కూడా వుంది. చేసే ప్రతి పని కూడా పరిపూర్ణతతోనే జరగాలని కోరుకోవడం, అందరి కంటే నేనే ముందుండాలి, నాదే బాగుండాలని కోరుకోవడం, అలాగే ఇతరుల LIFE STYLE తో మనల్ని పోల్చుకోవడం, చూసిందల్లా కావాలని కోరుకోవడం వల్ల కూడా ఈ పదే పదే ఆలోచనలు వస్తుంటాయి.
అతిగా ఆలోచించడం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం

పదే పదే ఆలోచించడం వల్ల ఏదైనా సాధించామా? అంటే ప్రస్తుత సమాజంలో అది కూడా లేదు. సాధించడమూ లేదు కదా పైగా అన్నీ కోల్పోవడమే జరుగుతోంది. దీంతో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చిపడుతున్నాయి. దీంతో డాక్టర్ల దగ్గర, మందుల కోసం పదే పదే డబ్బు ఖర్చు చేయాల్సి కూడా వస్తోంది.
ఇవి కూడా చదవండి
పదే పదే ఆలోచనల నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మిక సాధన కూడా బాగా ఉపకరిస్తుంది. తదేకంగా మనకు ఇష్టమైన దైవ ప్రార్థన, లేదా మంత్రాన్ని బాగా జపించడం వల్ల మనస్సు ఒకే దానిపై లగ్నమవుతుంది. దీని ద్వారా మనలో వున్న శక్తి, ప్రకృతిలో వున్న శక్తి కలిసి, మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి దోహదపడతాయి. అలాగే ప్రతి రోజూ ధ్యానం చేయడం వల్ల, కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, శ్వాస మీద దృష్టి పెట్టాలి. దీంతో మనస్సు నిలకడగా, నిశ్చలంగా వుంటుంది.
ఇలా చేస్తే పదే పదే వచ్చే ఆలోచనలను తగ్గించుకోవచ్చు

అలాగే మన ఇల్లు గానీ, మనం వుండే ప్రదేశాలు కానీ.. చాలా శుభ్రంగా వుండేట్లు కూడా చూసుకోవాలి. గజిబిజిగా వుండటం వల్ల మన మనస్సుపై అతి తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. దీంతో మనస్సు చంచలం అయిపోయి, ఆలోచనల వైపు మళ్లిపోతుంది. దీంతో మళ్లీ సమస్యలు వస్తాయి. అలాగే ఖాళీ సమయం వుంటే పదే పదే ఆలోచనలు వస్తాయి. మనకు నచ్చిన పని చేయాలి, పుస్తకాలు చదవాలి, లేదా వ్యాయామం చేయాలి, లేదా ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని, పని చేస్తుంటే ఆలోచనలు తగ్గుతాయి.
నచ్చిన సంగీతం వినడం, పజిల్స్ ఆడుకోవడం కూడా దీని నుంచి బయటకు పడేస్తాయి. తీవ్రమైన ఆలోచనలు వచ్చినప్పుడు నెమ్మదిగా ముక్కు మూసేసి, శ్వాస పీల్చుకుంటూ, నోటి ద్వారా వదిలేయండి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.రోజూ 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్రలేమి ఆలోచనలను పెంచుతుంది.కెఫిన్ (టీ, కాఫీ) మరియు స్క్రీన్ టైమ్ (ఫోన్ వాడకం) తగ్గించండి. ఇలా చేయడం ద్వారా మనస్సు కుదుటపడి, ఆలోచనలు తగ్గిపోతాయి.








