యునైటెడ్ కింగ్ డమ్.. ఇక చరిత్ర పుటల్లోకేనా..?
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంగా శతాబ్దాల వెలుగులు.. ఇక చరిత్ర పుటలకు పరిమితం కానున్నాయా.. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలను ఏలిన గ్రేట్ బ్రిటన్.. ఇప్పుడు మసకబారిపోతోందా? గతంలో బ్రిటన్ వలసవాద కాలనీలు.. ఆ తర్వాత ప్రత్యేక దేశాలు మారిపోయాయి. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ…అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు అందులో అంతర్భాగంగా ఉన్న సెమీ అటానమస్ ప్రాంతాలు వేరుపడాలని చూస్తున్నాయి.ోో
గ్రేటర్ ఐర్లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేసిన 48 గంటల్లోనే వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ దేశాల ఫస్ట్ మినిస్టర్లు సోమవారం కార్డిఫ్‌లో సమావేశమై ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం యూకే నుంచి తాము విడిపోవడానికి రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించాలని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ను డిమాండు చేశారు.
తమ భవిష్యత్తు యూరోపియన్ యూనియన్ తో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. వెస్ట్‌మినిస్టర్‌కు (బ్రిటన్ పార్లమెంటు, ప్రభుత్వానికి కేంద్ర స్థానం) కాలం చెల్లిపోయిందనడానికి ఇంతకు మించిన సంకేతం లేదని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే ఈ డిమాండును బర్న్‌హామ్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. ఈ హెచ్చరికను ప్రధాని పక్కనబెట్టారని, రాజ్యాంగ చర్చల కంటే జీవన వ్యయాన్ని తగ్గించడానికి సంబంధించిన చర్యలకే ఆయన ప్రాధాన్యమిస్తున్నారని ప్రధాని అధికార ప్రతినిధి టామ్ వెల్స్ స్పష్టం చేశారు. విభజనకు బదులుగా ఉమ్మడి విలువలకు కట్టుబడి, సమస్య పరిష్కారానికి ప్రజలు కలిసి వచ్చినప్పుడే యూకే అత్యుత్తమంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
బ్రిటన్, యూకే కొన్ని దేశాల సమాహారంగా ఏర్పడ్డాయి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ కలిసి గ్రేట్ బ్రిటన్. వీటికి ఉత్తర ఐర్లాండ్ కలిస్తే యునైటెడ్ కింగ్డమ్ (UK). ఇప్పుడు ఈ యూకే నుంచి బయటపడి.. పూర్తి స్వయం ప్రతిపత్తిగల దేశాలుగా ఆవిర్భవించాలని వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ కోరుకుంటున్నాయి. అదే జరిగితే యూకేలో ఇంగ్లాండ్ ఒంటరవుతుంది. 1990లో యూకే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అధికారాలను వికేంద్రీకరించింది.








