అక్టోబర్ 17న మేరీల్యాండ్ లో బతుకమ్మ – దసరా సంబరాలు
మేరీల్యాండ్ తెలంగాణ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సంప్రదాయ వేడుకలతో బతుకమ్మ , దసరా సంబరాలు 2026 ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు అక్టోబర్ 17, 2026 న సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు జరగనున్నాయి.
వేదిక వివరాలు..
ఈ కమ్యూనిటీ వేడుక మేరీల్యాండ్ లోని మారియట్స్ విల్లే (Marriottsville, MD 21104) లో ఉన్న 12100 వుడ్ఫోర్డ్ డ్రైవ్ (12100 Woodford Dr) లోని మారియట్స్ రిడ్జ్ హైస్కూల్ (Marriotts Ridge High School) లో నిర్వహించబడుతుంది. కుటుంబసమేతంగా ఈ సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు.








