కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. దేశ వ్యాప్తంగా అమలు : మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా సాగిందని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రధాని చేయడమే లక్ష్యమన్నారు. కుల సర్వేతో తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం జరిగిందన్నారు. కుల సర్వేను కేంద్రం తొక్కి పెట్టడం దురదృష్టకరమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy)తో నాకు ఎక్కడా గొడవ జరగలేదు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమే. మా మధ్య గ్యాప్ ఉందని, గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. అలాంటివి ఏమీ లేవు. సీఎంతో అభిప్రాయ బేధాలు వచ్చినా సాయంత్రానికే సరి చేసుకున్నాం. పార్టీ విషయంలో సీఎం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. బీసీ మంత్రిని తొలగించినప్పుడు నేను కూడా బాధాపడ్డా. ఏఐసీసీ ( AICC) నిర్ణయం మేరకే సురేఖపై చర్యలు తీసుకున్నాం. క్రమశిక్షణ తప్పితే ఎవరిపైనా అయినా చర్యలు తప్పవు. క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏఐసీసీ నిర్ణయించింది అని అన్నారు.








