2 వేల ఏళ్లనాటి టెర్రకోట డాబర్ .. నల్గొండ జిల్లాలో
శాతవాహనుల పూర్వకాలానికి చెందిన టెర్రకోట డాబర్(Terracotta Dabar) (తాపీలాంటి పరికరం) ను నల్గొండ జిల్లా(Nalgonda district) అప్పాజిపేటలో తాజాగా గుర్తించినట్లు తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ (Sriramoju Haragopal) వెల్లడించారు. గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు చిక్కుల యాదగిరి(Chikkula Yadagiri), మేక అశోక్ రెడ్డి(Meka Ashok Reddy)లు 2 వేళ్ల క్రితం నాటి ఈ టెర్రకోట డాబర్ను కనుగొన్నట్లు తెలిపారు. అప్పట్లో కుండలు చేసే సమయంలో టెర్రకోట డాబర్ను లోపలివైపు పెట్టుకుని, పై నుంచి మరో చెక్కబద్దతో కొడుతూ కుండకు ఆకారాన్ని ఇచ్చేవారని పేర్కొన్నారు. ఇటువంటివి గతంలో ఉత్తర్ ప్రదేశ్లో లభించాయన్నారు. అవి క్రీ.పూ 200ల నుంచి క్రీ.శ.600 సంవత్సరాల నాటివని పేర్కొన్నారు.








