అసెంబ్లీకి రానిస్తే .. ఆధారాలతో అన్నీ నిరూపిస్తా : మాధవరం కృష్ణారావు
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) అసెంబ్లీలో తన గురించి చేసిన ప్రస్తావనపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) స్పందించారు. హైదర్నగర్లో 145, 163 సర్వే నంబర్లలోని భూమి చాలా ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు (Registrations) కావట్లేదని మంత్రి తప్పుదోవ పట్టించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఏడాదిపాటు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపారు. 22 ఏపై సిట్టింగ్ జడ్జి(Sitting judge)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ(Assembly)కి రానిస్తే, 22ఏ పై అన్ని ఆధారాలతో నిరూపిస్తానని తెలిపారు. తాను చెప్పేవి అబద్ధాలైతే రాజకీయాల నుంచి వైదొలగుతానని అన్నారు.








