కాశీ విశ్వనాథుడికి సీఎం చంద్రబాబు పూజలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వారణాసిలో పర్యటించారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో పాల్గొనేందుకు సీఎం వచ్చారు. పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh), పంకజ్ చౌదరి (Pankaj Chaudhary), చిరాగ్ పాసవాన్ (Chirag Paswan), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తదితరులు కలిసి కాశీ విశ్వనాథుడిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్రమంత్రులలో కలిసి సీఎం ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.








