ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, కేంద్రమంత్రి రాజ్నాథ్లతో చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ
వారణాసి-వాద్నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి( Varanasi)చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సేవాయాత్రలో భాగమైన పలువురు జాతీయ ప్రముఖులతో కూడా సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. దేశ ప్రగతికి, జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.








