సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులపై విచారణకు సిద్ధమా? : కేటీఆర్
మాజీ సీఎం కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విష ప్రచారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్‌కు 67 ఎకరాలు మాత్రమే ఉందని అసెంబ్లీ సాక్షిగా సీఎం అంగీకరించారని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇన్ని రోజులు విష ప్రచారం చేసినందుకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి (Revanth Reddy) క్షమాపణ చెప్పాలి.కేసీఆర్ పుట్టినప్పటి నుంచి మా కుటుంబ ఆస్తులెన్నో విచారణకు మేం సిద్ధం. రేవంత్ పుట్టినప్పుడు ఆయన ఆస్తులెన్ని, ఇప్పుడు ఎన్నో విచారణకు సిద్ధమా? కేసీఆర్ (KCR)కు వ్యవసాయం అంటే మక్కువ. సీఎంగా ఉన్నా వ్యవసాయం చేశారు. రేవంత్‌లా భూమిని ఆయన ఆట వస్తువుగా చూడలేదు.చట్టప్రకారం కేసీఆర్ కొనుగోలు చేసిన భూములపై సీఎం బురద చల్లుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. కేసీఆర్ తండ్రికి వందల ఎకరాలు ఉండేవి. అప్పట్లోనే కేసీఆర్ ఇల్లు రెండెకరాల్లో ఉండేది. చింతమడకలోని ఆ ఇంటిని కూడా ప్రభుత్వ స్కూల్‌కి ఇచ్చారు. ఎన్ని ఆరోపణలు చేసినా 22ఏ బాధితుల పక్షానే నిలబడతాం. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటా అని అన్నారు.








